Posts

Showing posts from 2026

Greek & Hindu Mythology

Mythology - సిరీస్ 1 Mythology అనేది ఒక నిర్దిష్ట సంస్కృతికి చెందిన దేవుళ్ళు, దేవతలు, వీరులు మరియు అతీంద్రియశక్తి జీవుల గురించి చెప్పే సాంప్రదాయ కథల సమాహారం. పురాణాలు ప్రాచీన నాగరికతల మత విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాలు మరియు విలువలను పరిరక్షిస్తాయి. ప్రపంచంలోని ప్రధాన పురాణాలు హిందూ Mythology: హిందూ పురాణశాస్త్రం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలపై ఆధారపడి వుంది. ఇందులో బ్రహ్మ, విష్ణువు , శివుడు, దుర్గ, లక్ష్మి, శ్రీకృష్ణ, రామ, హనుమాన్ మరియు అనేక ఇతర పాత్రలు ఉన్నాయి. గ్రీకు పురాణశాస్త్రం: ఒలింపస్ పర్వతం కేంద్రంగా సాగే ఈ సంప్రదాయంలో జ్యూస్, పోసిడాన్, హేడిస్ వంటి 12 మంది దేవతలతో పాటు హెర్క్యులస్, అకిల్లీస్, ఒడిస్సియస్ వంటి పౌరాణిక వీరులు కూడా ఉన్నారు. రోమన్ పురాణశాస్త్రం: దేవుళ్ళు మరియు దేవతలు బృహస్పతి: దేవతలందరికీ రాజు మరియు ఆకాశానికి అధిపతి, గ్రీకు దేవుడైన జ్యూస్‌తో సమానం. - హిందూ మితోలజీ లో ఇంద్రుడుతో సమానం. జూనో: దేవతల రాణి మరియు వివాహ, ప్రసవ దేవత, గ్రీక్ దేవత హేరాతో సమానం. మినర్వా: జ్ఞానం, హస్తకళలు మరియు కళలకు అధిదేవత, ఎథీనాతో సమానం - హిందూ మితోలజీ ...

Oscar Wilde short stories in Telugu

Image
 ‘Selected works of Oscar Wilde’. సాహితి ప్రియుడు,ద్విభాషా కవి ( bilingual poet) మరియు ఇంగ్లీష్ లెక్చరర్ అయిన అగ్రెస్ ప్రకాష్ రావు గారు నాకు ‘Selected works of Oscar Wilde’ పుస్తకాన్ని బహుమానంగా ఇచ్చారు. దీంట్లో  ఆస్కార్ వైల్డ్ ప్రసిద్ద కథలు మరియు నాటకాలున్నాయి. అందులోంచి కొన్ని కథలు సూక్ష్మంగా నా మాటల్లో.  1.“The Happy Prince”.  Happy Prince అభ్యర్థన మేరకు అతని దూత (messenger) గా ఉండి పేద పిల్లలకు సహాయం చేసే క్రమంలో తన జీవితాన్ని త్యాగం చేసే పిచ్చుక కథ (Swallow). ఇతరుల బాగు కోసం తమకున్న దానిని వదులుకోవడం నిజమైన ప్రేమ అని ఈ కథ చెబుతుంది. ప్రేమ, కరుణ, త్యాగగుణం గల వారు దేవుని చెంత స్థానాన్ని పొందుతారని నిరూపించే కథ. హ్యాపీ ప్రిన్స్, పిచ్చుక (swallow) ఇద్దరు కరుణ, ప్రేమ, త్యాగాలకు ప్రతీక. అన్ని పిచ్చుకలు autumn season రాగానే ఈజిప్ట్ బయలుదేరుతాయి. తను ఈజిప్ట్ వెళ్లే మార్గంలో ఎత్తయిన హ్యాపీ ప్రిన్స్ బంగారు విగ్రహం దగ్గర సేద తీరుతుంది. హ్యాపీ ప్రిన్స్ శరీరం అంతా సన్నని బంగారు రేకులతో పూత పూయబడి వుంటుంది. తన ప్రజల బాధలు, ధనిక, పేద అసమానతలు చూసి కన్నీరు పెట్టుకోని తన sword ...

Telugu short stories / నా తెలుగు కథలు

Image
మినీ కథ - 7 * పుట్టింటి పట్టుచీర* S.రాజేష్ కుమార్  ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి సోఫాలో కూచొని టీ తాగుతూ భార్య పద్మతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాడు రమేష్. వారిద్దరి సరదా కబుర్లకు అడ్డు పడుతూ ఫోన్ రింగయింది.  “ఈ వెధవ ఫోన్ హాయిగా మగనితో ముచ్చట గూడ పెట్టినీయదు” అని గొణుగుతూ లోనికి వెళ్ళింది పద్మ. “హలో! రమేష్ ఈ సండే మా చెల్లి పెళ్లి. ఇక్కడే AV ఫంక్షన్ హాల్లో. నువ్వు తప్పకుండ ఫ్యామిలీతో రావాలి” అని ఫోన్ పెట్టేసాడు అవతలి వ్యక్తి. పద్మకి తన ఫ్రెండ్ చెల్లి పెళ్లి సంగతి చెప్పి, “సండే పోదాం ఏమంటావ్” అని అడిగాడు.  పద్మ ముఖంలో ఆనాసక్తి గమనించి “వాడు బంధువుగాకున్న నాకు ఆత్మబంధువు”. సండేనేగా పోదాం ప్లీజ్! అన్నాడు రమేష్. సరేన్నన్నట్లు తల ఊపింది పద్మ. ఉదయం పదకొండున్నరయింది. పద్మ మరియు రమేష్ హడావుడిగా ఫంక్షన్ హల్ చేరుకొనేసరికే జీలకర్ర-బెల్లం ఘట్టం ముగిసింది. ఇక తాళి కట్టే తంతు ముగిసాక స్టేజి పైన వధూవరులను ఆశీర్వదించి తన ఫ్రెండ్ తో కలిసి ఓ గ్రూప్ ఫోటోకి పొజిచ్చి క్రిందికి దిగారు. ఆకలి దంచేస్తుండడంతో డైనింగ్ హల్ వైపు పరుగు లాంటి నడకతో వెళ్లారిద్దరూ. రమేష్ అటు చూడు. ఆ కార్నర్లో తింటున్నామెను...

OU MA English Sem 1 Question papers

Image
 Osmania University Hyderabad MA ENGLISH Regular Sem 1 question papers. Exams held in March 2026