Posts

Showing posts from June, 2026

Oscar Wilde short stories in Telugu

Image
 ‘Selected works of Oscar Wilde’. సాహితి ప్రియుడు,ద్విభాషా కవి ( bilingual poet) మరియు ఇంగ్లీష్ లెక్చరర్ అయిన అగ్రెస్ ప్రకాష్ రావు గారు నాకు ‘Selected works of Oscar Wilde’ పుస్తకాన్ని బహుమానంగా ఇచ్చారు. దీంట్లో  ఆస్కార్ వైల్డ్ ప్రసిద్ద కథలు మరియు నాటకాలున్నాయి. అందులోంచి కొన్ని కథలు సూక్ష్మంగా నా మాటల్లో.  1.“The Happy Prince”.  Happy Prince అభ్యర్థన మేరకు అతని దూత (messenger) గా ఉండి పేద పిల్లలకు సహాయం చేసే క్రమంలో తన జీవితాన్ని త్యాగం చేసే పిచ్చుక కథ (Swallow). ఇతరుల బాగు కోసం తమకున్న దానిని వదులుకోవడం నిజమైన ప్రేమ అని ఈ కథ చెబుతుంది. ప్రేమ, కరుణ, త్యాగగుణం గల వారు దేవుని చెంత స్థానాన్ని పొందుతారని నిరూపించే కథ. హ్యాపీ ప్రిన్స్, పిచ్చుక (swallow) ఇద్దరు కరుణ, ప్రేమ, త్యాగాలకు ప్రతీక. అన్ని పిచ్చుకలు autumn season రాగానే ఈజిప్ట్ బయలుదేరుతాయి. తను ఈజిప్ట్ వెళ్లే మార్గంలో ఎత్తయిన హ్యాపీ ప్రిన్స్ బంగారు విగ్రహం దగ్గర సేద తీరుతుంది. హ్యాపీ ప్రిన్స్ శరీరం అంతా సన్నని బంగారు రేకులతో పూత పూయబడి వుంటుంది. తన ప్రజల బాధలు, ధనిక, పేద అసమానతలు చూసి కన్నీరు పెట్టుకోని తన sword ...

Telugu short stories / నా తెలుగు కథలు

Image
నేను రాసిన తెలుగు షార్ట్ స్టోరీస్ ను బ్లాగ్ subscribers కోసం ఇక్కడ post చేశాను. కథ - 1                                           డోపమిన్ ట్రాప్                                       డా. ఎ స్. రాజేష్ కుమార్ హాస్పిటల్ లో బెడ్ పై నిస్తేజంగా పడి వున్న తన కొడుకుని చూసి నిచ్చేస్తుడాయ్యడు శేఖర్. అతని ముఖం,అరచేతులు చమటతో తడిసిపోయాయి. గొంతు తడారిపోయింది.గొంతులో నుంచి మాట పెగడడం లేదు. కొంత దూరాన వున్న భార్య కవిత వైపు బేలగా చూసాడు.  కవిత కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీటిని ఆపుకోలేక, గొంతులో వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ... తడిసిన తన కళ్ళను చీర కొంగుతో అద్దుకుంటూ శేఖర్ వద్ద కు పరిగెత్తుకు వెళ్లి గట్టిగా కౌగాలించుకొని “వాడి ప్రాణాలకు ప్రమాదం  లేదు అంటున్నారండి డాక్టర్లు” అని వెక్కిళ్లు అపుకుంటూ జరిగిన విషయం చెప్పింది. శేఖర్ మాత్రం నోట మాట రాక స్థాణువుల నిలబడిపోయాడు. ఇది ఎలా జరిగింది? ...