Posts

Showing posts with the label Telugu Short Stories

Telugu short stories / నా తెలుగు కథలు

Image
గౌతమి సాహితీ సేవా సంస్థ మంథని వారు నిర్వహించిన  ఒక పేజీ కథల పోటీకి పంపిన కథ ( 300 పదాలకు మించకుండా)  తేదీ:- 7/11/2026 అంశం:- మెలకువ తెచ్చిన కల శీర్షిక :- చీకటి వెలుగులు    ప్రభుత్వ విధానాలు మారడం వల్ల అమెరికాలో విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే వార్తలు తరుచుగా వస్తున్న సమయమది.   ఎం.ఎస్. పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నంలో వున్న కొడుకుతో నారాయణ ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ “నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి‘?. ‘ఇంకా ఉద్యోగం దొరకలేదు నాన్న. చిన్నాచితకా పనులతో నెట్టుకొస్తున్న. నేను అలసిపోయాను. జీవితంలో ఓడిపోతానని మొదటిసారిగా అనిపిస్తుంది’ అని పెల్లుబికుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ బలహీనస్వరంతో అన్నాడు రఘు.  ‘దేశం కాని దేశంలో వున్న తన కొడుకు కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టమని మనసులోనే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ధైర్యంగా వుండు, అంతా మంచే జరుగుతుంది’ అంటూ తన కనుకొలకుల్లో కన్నీరు తుడుచుకుంటూ ఫోన్ పెట్టేసాడు నారాయణ. రఘు అమెరికాలో ఎం.ఎస్ చేసి అక్కడే స్థిరపడాలని కోరికతో ఎన్నో ఆశలతో విదేశీగడ్డ పై అడుగు పెట్టాడ...