Greek & Hindu Mythology
Mythology - సిరీస్ 1
Mythology అనేది ఒక నిర్దిష్ట సంస్కృతికి చెందిన దేవుళ్ళు, దేవతలు, వీరులు మరియు అతీంద్రియశక్తి జీవుల గురించి చెప్పే సాంప్రదాయ కథల సమాహారం.
పురాణాలు ప్రాచీన నాగరికతల మత విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాలు మరియు విలువలను పరిరక్షిస్తాయి.
ప్రపంచంలోని ప్రధాన పురాణాలు
హిందూ Mythology: హిందూ పురాణశాస్త్రం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలపై ఆధారపడి వుంది. ఇందులో బ్రహ్మ, విష్ణువు , శివుడు, దుర్గ, లక్ష్మి, శ్రీకృష్ణ, రామ, హనుమాన్ మరియు అనేక ఇతర పాత్రలు ఉన్నాయి.
గ్రీకు పురాణశాస్త్రం: ఒలింపస్ పర్వతం కేంద్రంగా సాగే ఈ సంప్రదాయంలో జ్యూస్, పోసిడాన్, హేడిస్ వంటి 12 మంది దేవతలతో పాటు హెర్క్యులస్, అకిల్లీస్, ఒడిస్సియస్ వంటి పౌరాణిక వీరులు కూడా ఉన్నారు.
రోమన్ పురాణశాస్త్రం:
దేవుళ్ళు మరియు దేవతలు
బృహస్పతి: దేవతలందరికీ రాజు మరియు ఆకాశానికి అధిపతి, గ్రీకు దేవుడైన జ్యూస్‌తో సమానం. - హిందూ మితోలజీ లో ఇంద్రుడుతో సమానం.
జూనో: దేవతల రాణి మరియు వివాహ, ప్రసవ దేవత, గ్రీక్ దేవత హేరాతో సమానం.
మినర్వా: జ్ఞానం, హస్తకళలు మరియు కళలకు అధిదేవత, ఎథీనాతో సమానం - హిందూ మితోలజీ లో ‘సరస్వతి’
మార్స్: యుద్ధ దేవుడు మరియు రోమ్ సంరక్షకుడు, ఏరిస్‌తో సమానం - హిందూ మైతోలజీ లో ‘స్కంద’/ మురుగన్.
నెప్ట్యూన్: సముద్ర దేవుడు, గ్రీక్ లో పోసిడాన్‌తో సమానం - హిందూ మైతోలజీ లో వరుణ దేవుడు
వీనస్: ప్రేమ మరియు సౌందర్య దేవత, గ్రీక్ దేవత ఆఫ్రోడైట్‌తో సమానం
అపోలో: సంగీతం, సూర్యుడు మరియు వైద్యానికి అధిపతి, మరియు గ్రీకు మరియు రోమన్ సంప్రదాయాలు రెండింటిలోనూ ఒకే పేరును కలిగి ఉన్న ఏకైక ప్రధాన దేవుడు - హిందూ మితోలజీ లో సూర్య దేవుడు
Norse Mythology: Northern యూరోప్ లోని నార్వే స్వీడెన్, డేన్మార్క్ దేశాలకు (Viking traditions) కు సంబంధించింది.
ఓడిన్ (Odin): సర్వపిత (All-Father) మరియు నార్స్ దేవతలకు రాజు. ఇతను జ్ఞానం, యుద్ధం, మరణం మరియు కవిత్వానికి దేవుడు.
థార్ (Thor): ఉరుములు మరియు మెరుపుల దేవుడు (Thunder God). ఇతను ఓడిన్ కొడుకు. ఇతని దగ్గర 'మ్యూల్నిర్' (Mjollnir) అనే శక్తివంతమైన సుత్తి ఉంటుంది.
‘లోకి’ (Loki): ఇతను మోసగాడు మరియు అల్లరిచిల్లరగా ఉండే దేవుడు (Trickster God). ఇతనికి రూపం మార్చుకునే శక్తి వుంది.
01/10/2026
Mythology - Series 2
12 మంది గ్రీక్ ఒలింపియన్ దేవతలు ( Olympians)
మౌంట్ ఒలింపస్:- ఈ పర్వతం మీదనే పన్నెండు మంది దేవుళ్ళు,దేవతలు నివాసముటారని గ్రీస్ దేశస్తుల నమ్మకం. ఈ పన్నెండు మందిని “ఒలింపియన్లు’ అంటారు
1. జ్యూస్ (Zeus)
ఆకాశం, ఉరుము (thunder), రాజరికం
దేవతలకు రాజు. ఇతని చిహ్నాలు: వజ్రాయుధం, గద్ద, ఓక్ చెట్టు.
Zeus తన తండ్రి క్రోనస్‌ను (Titan Cronus) గద్దెదించి , తన సోదరులతో విశ్వాన్ని పంచుకున్నాడు. Zeus తన తోబుట్టువులు హేరా (Hera) మరియు డిమీటర్ ను (Demeter) పెళ్లాడాడు.
2. హేరా (Hera)
దేవతల రాణి మరియు జ్యూస్ భార్య మరియు సోదరి.
చిహ్నాలు: నెమలి, దానిమ్మ.
3. పోసిడాన్ (Poseidon)
సముద్రం, భూకంపాలు, గుర్రాలు
సముద్ర పాలకుడు, 'భూకంపాలు సృష్టించేవాడు'
చిహ్నాలు: త్రిశూలం, డాల్ఫిన్, గుర్రం. అతను ఏథెన్స్ కోసం జరిగిన పోటీలో ఏథీనా చేతిలో ఓడిపోతాడు.
4. డెమెటర్ (Demeter)
పంట, ధాన్యం
వ్యవసాయానికి మరియు ఋతువులకు అధిదేవత. చిహ్నాలు: గోధుమ కంకి, కాగడా. ఆమె సోదరుడు హేడిస్ (Hades) తన కుమార్తె పెర్సెఫోన్‌ను (Persephone) kidnap చేసి తీసుకెళతాడు.
5. ఏథీనా ( Athena)
జ్ఞానం, వ్యూహం, నైపుణ్యం
జ్యూస్ తల నుండి పూర్తి ఆయుధాలతో జన్మించింది, ఏథెన్స్‌కు సంరక్షకురాలు. ఏథెన్స్‌కు జ్ఞాన మరియు యుద్ధ దేవత అయిన ఏథీనా పేరు పెట్టారు. .
చిహ్నాలు: గుడ్లగూబ, ఆలివ్ చెట్టు, ఏజిస్.
6. అపోలో ( Apollo)
కాంతి, సంగీతం, భవిష్యవాణి, స్వస్థత
లైర్ వాద్యానికి, విలువిద్యకు మరియు డెల్ఫీలోని దేవవాణికి అధిపతి. (Oracle at Delphi)
చిహ్నాలు: లైర్ ( Lyre), లారెల్ పుష్పగుచ్ఛం, విల్లు.
ఆర్టెమిస్ యొక్క కవల సోదరుడు మరియు రోమన్ల దేవుళ్ళ లో కూడా అపోలో ఇదే పేరుతో వున్నాడు.
7.ఆర్టెమిస్ ( Artemis)
వేట, అరణ్యం, చంద్రుడు
వన్యప్రాణులకు మరియు యువతులకు రక్షకురాలు, చిహ్నాలు: ధనుస్సు, జింక, నెలవంక.
8. ఏరిస్ (Ares)
యుద్ధం, ధైర్యం, హింస
చిహ్నాలు: ఈటె, శిరస్త్రాణం, రాబందు. గ్రీకు పురాణాలు, తరువాత రోమ్ చూపిన గౌరవం కన్నా ఇతని పట్ల చాలా తక్కువ గౌరవాన్ని చూపుతాయి.
9. అఫ్రోడైటి (Aphrodite)
ప్రేమ, సౌందర్యం, కోరిక.
చిహ్నాలు: పావురం, గులాబీ, గవ్వ.
ఆమె పారిస్‌కు బంగారు ఆపిల్‌ను బహుమతిగా ఇవ్వడంతో ట్రోజన్ యుద్ధం ప్రారంభమైంది.
10. హెఫెస్టస్ (Hephastes)
అగ్ని, లోహపు పని, చేతిపనితనం
దేవతల కమ్మరి, అకిల్లీస్ కవచాన్ని మరియు జ్యూస్ పిడుగులను తయారుచేశాడు.
చిహ్నాలు: సుత్తి, దాగలి, పటకారు. ఇతను శారీరక వికలాంగుడు.
11. హెర్మెస్ (హెర్మెస్)
ప్రయాణం, వ్యాపారం, సందేశాలు, దొంగలు
దేవతల దూత.
చిహ్నాలు: రెక్కల చెప్పులు, కాడ్యూసియస్, రెక్కల టోపీ..
12. హెస్టియా (Hestia)/ డయోనిసస్ (Wine)
ద్రాక్షారసం, పొయ్యి (hearth) మరియు నాటకరంగం
హెస్టియా ఇంటిలోని fire placeని (hearth) మరియు పవిత్రమైన జ్వాలను కాపాడేది. తరువాతి జాబితాలలో ఆమె తన స్థానాన్ని wine మరియు నాటకానికి (Drama) అధిపతి అయిన డయోనిసస్‌కు అప్పగించింది, అతని పండుగలే గ్రీకు నాటకరంగానికి పునాది.
Mythology - Series 3
గ్రీక్ మరియు హిందూ దేవతల సారూప్యత
జ్యూస్ Zeus మరియు ఇంద్రుడు ( Indra).
Exact equivalents కావు. కొన్ని aspects లో పోలికలు.
వీళ్ళు దేవతలకు పరిపాలకులు
ఉరుములు, మెరుపులను నియంత్రిస్తారు. స్వర్గాన్ని రక్షిస్తారు.ఇద్దరూ వజ్రాయుధాలను తమ ప్రధాన ఆయుధాలుగా ఉపయోగిస్తారు.
జ్యూస్ ఒలింపస్ పర్వతానికి పాలకుడు.
జ్యూస్ కుటుంబం :-, జ్యూస్,పోసిడాన్, హేడిస్, హెస్టియా, డెమెటర్, మరియు హేరా
జ్యూస్ తన స్వంత అక్కలు హేరా మరియు డెమెటర్‌లను పెళ్లి చేసుకున్నాడు.
వీరిద్దరూ Zeus & Indra ఇద్దరూ స్త్స్త్రీలోలురైన దేవతలు. రూపం మార్చి స్త్రీలను మోసం చేసినవారే. ఇంద్రుడు అహల్య సౌందర్యానికి ముగ్ధుడై (గౌతమ మహర్షి భార్య) ఆమెను పొందాలనుకున్నాడు. గౌతమ మహర్షి నిత్యసంధ్యావందనం కోసం నదికి వెళ్లిన సమయంలో ఆమె దగ్గరికి ఇంద్రుడు గౌతముడి రూపంలో ఆశ్రమంలోకి వెళ్తాడు. గౌతముడు తన దివ్యదృష్టితో జరిగింది గ్రహించి తిరిగొచ్చి ఇంద్రుడిని, అహల్యను శపిస్తాడు.
ఇదే విధంగా Zeus కూడా ఆల్క్‌మీన్‌ను ఆమె భర్త రూపం లో వచ్చి మోసగిస్తాడు.
ఆంఫిట్రియాన్ భార్య ఆల్క్‌మీన్‌ను మోసం చేయడానికి జ్యూస్ (Zeus) ఆంఫిట్రియాన్ రూపాన్ని ధరించి ఆమె తో సంగమిస్తాడు. ఫలితంగా వీరికి వీరుడైన హెరాక్లిస్ (జ్యూస్ మరియు ఆల్క్‌మీన్‌ల సంతానం) జన్మిస్తాడు.
ఆంఫిట్రియాన్ టెలిబోయన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళినపుడు జ్యూస్ ఆల్క్‌మీన్‌ను ఆమె భర్త వేషంలో కలవడానికి వీలుగా ఒక రాత్రి కాలాన్ని సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువసేపు ఉండేలా చేస్తాడు.
Mythology - Series 4
జ్యూస్ స్త్రీలను మోసగించిన కథలు
వారి వంశాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి గ్రీకు దేవతలు రక్తసంబంధీకులతో వివాహాం చేసుకున్నారు.జ్యూస్
తన సోదరి హేరాను వివాహం చేసుకోవడంతో ఆమె దేవతల రాణిగా,వివాహ మరియు కుటుంబ దేవతగా అయ్యింది.
(i) cuckoo bird myth: జ్యూస్ చలితో వణికిపోతున్న cuckoo bird (కోకిల పక్షి) గా మారి హెరా వద్దకు వెళితే, హేరా జాలి పడి దానిని తన ఛాతికి హత్తుకుంటే, Zeus ఆమెను లొంగదీసుకొని తన నిజరూపంలోకి మారి ఆమెను వివాహమాడుతాడు.
(ii) హంస మరియు లేడా Swan & Leda : స్పార్టన్ రాణి అయిన లేడాను సమీపించి, లొంగదీసుకోవడానికి Zeus తనను తాను హంసగా మార్చుకుంటాడు.
(iii) Zeus ( Bull) మరియు Europa (యూరోపా )
ఫోనీషియన్ యువరాణి యూరోపాను అపహరించడానికి ఒక అద్భుతమైన తెల్లని ఎద్దు రూపంలో Zeus వెళుతాడు. యూరోపా సముద్ర తీరంలో పువ్వులు కోస్తుండగా, ఆమెను భయపెట్టకుండా ఉండేందుకు జీయస్ అందమైన తెల్లని ఎద్దుగా రూపాంతరం చెందాడు. ఆ ఎద్దు ప్రవర్తనకు ముగ్ధురాలైన యూరోపా, దాని వీపుపైకి ఎక్కగానే Zeus వెంటనే సముద్రంలోకి దూకి, మధ్యధరా సముద్రాన్ని ఈదుకుంటూ క్రీట్ ద్వీపానికి చేరుకుంటాడు. క్రీట్‌లో, జీయస్ తన నిజ స్వరూపాన్ని వెల్లడించాడు. యూరోపా ఆ ద్వీపానికి మొదటి రాణిని చేస్తాడు. ఆమె గౌరవార్థం యూరప్ ఖండానికి ఆమె పేరు పెట్టబడింది.
Comments
Post a Comment