Oscar Wilde short stories in Telugu
‘Selected works of Oscar Wilde’.
సాహితి ప్రియుడు,ద్విభాషా కవి ( bilingual poet) మరియు ఇంగ్లీష్ లెక్చరర్ అయిన అగ్రెస్ ప్రకాష్ రావు గారు నాకు ‘Selected works of Oscar Wilde’ పుస్తకాన్ని బహుమానంగా ఇచ్చారు.
దీంట్లో ఆస్కార్ వైల్డ్ ప్రసిద్ద కథలు మరియు నాటకాలున్నాయి. అందులోంచి కొన్ని కథలు సూక్ష్మంగా నా మాటల్లో.
1.“The Happy Prince”.
Happy Prince అభ్యర్థన మేరకు అతని దూత (messenger) గా ఉండి పేద పిల్లలకు సహాయం చేసే క్రమంలో తన జీవితాన్ని త్యాగం చేసే పిచ్చుక కథ (Swallow). ఇతరుల బాగు కోసం తమకున్న దానిని వదులుకోవడం నిజమైన ప్రేమ అని ఈ కథ చెబుతుంది. ప్రేమ, కరుణ, త్యాగగుణం గల వారు దేవుని చెంత స్థానాన్ని పొందుతారని నిరూపించే కథ.
హ్యాపీ ప్రిన్స్, పిచ్చుక (swallow) ఇద్దరు కరుణ, ప్రేమ, త్యాగాలకు ప్రతీక. అన్ని పిచ్చుకలు autumn season రాగానే ఈజిప్ట్ బయలుదేరుతాయి. తను ఈజిప్ట్ వెళ్లే మార్గంలో ఎత్తయిన హ్యాపీ ప్రిన్స్ బంగారు విగ్రహం దగ్గర సేద తీరుతుంది.
హ్యాపీ ప్రిన్స్ శరీరం అంతా సన్నని బంగారు రేకులతో పూత పూయబడి వుంటుంది. తన ప్రజల బాధలు, ధనిక, పేద అసమానతలు చూసి కన్నీరు పెట్టుకోని తన sword లో వున్న ‘రూబీ’(ముదురు ఎరుపు రంగులో ఉండే రత్నం),రెండు నీలమణి రత్నాల కళ్ళు, మరియు శరీరం పైవున్న బంగారు రేకులు అతిబీద కుటుంబాల పిల్లలకు దానం చేయటానికి పిచ్చుక సహాయం తీసుకోవడమే ఈ కథలో ముఖ్యాంశం. తీవ్ర చలి వల్ల పిచ్చుక ప్రాణాలు విడువడం. హ్యాపీ ప్రిన్స్ విగ్రహం సంతోషం కోల్పోవడంతో మేయర్ దాన్ని ముక్కలు చేయడం విషాదం.
“Bring me the two most precious things in the city”, said God to one of His angels” తన దేవదూతల లో ఒకరిని (angel) ‘ఈ పట్టణం లో అత్యంత విలువైన రెండు వస్తువులు తీసుకురా’ అని దేవుడు ఆదేశిస్తే దేవదూత హ్యాపీ ప్రిన్స్ సీసపుగుండె మరియు చనిపోయిన పిచ్చుకను తీసుకవస్తుంది.
కింది లింక్ క్లిక్ చేసి ఇంగ్లీష్ లో కథను చదవండి.
https://www.eastoftheweb.com/short-stories/UBooks/HapPri.shtml
2. The Selfish Giant
పిల్లలు దైవ స్వరుపులని, వారి పట్ల దయ, ప్రేమను కలిగివుండాలని, పిల్లల సంతోషమే ప్రకృతి సంతోషం అని చెప్పే కథ ‘The Selfish Giant’.
కథలో చివర్లో కనిపించే చిన్నారి యేసుక్రీస్తుకు ప్రతీక. స్వార్థాన్ని వదిలి ప్రేమను పంచిన రాక్షసుడికి దేవుడు మోక్షాన్ని ప్రసాదించాడని ఆస్కార్ వైల్డ్ ఈ కథ ద్వారా అందరికీ moral మెసేజ్ ఇచ్చారు.
రాక్షసుని తోటలో రంగు రంగుల అందమైన పుష్పాలు, చెట్లు, పక్షుల కిలకిలరావాల మధ్య పిల్లలు సంతోషంగా ఆడుకుంటుటారు.తన ఫ్రెండ్ దగ్గర ఏడు సంవత్సరాల ఉండి తన తోటకు తిరిగి వచ్చిన రాక్షసునికి (Giant) పిల్లలు ఆడుకోవడం నచ్చక పిల్లలు రాకుండా ఎత్తయిన గోడ నిర్మించి, Tresspassers will be Prosecuted’ అనే బోర్డు పెడతాడు. గ్రామం మొత్తం spring వస్తుంది కాని స్వార్థపరుడైన రాక్షసుని (Giant) తోటలో మాత్రం ఇంకా winter వుంటుంది. దాంతో పువ్వులు వికసించవు, పక్షులు మధురమైన గానం చేయవు. అంతా మంచు కప్పబడివుంటుంది. Giant కి తన తోట ఇలా ఉండడానికి పిల్లలు రాకపోవడమే అని బోధపడుతుంది.
ఒకరోజు అద్భుతమైన దృశ్యం చూస్తాడు. “ గోడకు వున్న ఒక చిన్న రంద్రం గుండా పిల్లలు లోపలికి వచ్చి చెట్లపై ఆడుకుంటుంటే, అన్ని పువ్వులు వికసించడం, పక్షులు అల్లరి చేయడం, పచ్చని చెట్లతో తోటంతా ఆహ్లాదకరంగా మారుతుంది. ఇదంతా పిల్లలు రావడం వల్లనే అని Giant కు అర్థమవుతుంది. ఒక మూలన మాత్రం చెట్టు కింద చిన్న బాలుడు (little boy) నిలబడడం చూసి అతను చెట్టు ఎక్కడానికి సహాయం చేస్తే దానికి ప్రతిఫలంగా బాలుడు రెండు చేతులు చాచి giant మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెడతాడు. బాలుడు చెట్టు ఎక్కగానే చెట్టు పచ్చదనం సంతరించుకుంటుంది, చెట్టు పైకి పక్షులు చేరి పాడటం మొదలుపెడతాయి.
Giant మనసు మార్చుకొని తాను కట్టిన ఎత్తయిన గోడను కూల్చేసి, నోటీసు బోర్డు తీసివేస్తాడు.
ప్రతి రోజు స్కూల్ సమయం తర్వాత పిల్లలు తోటకు ఆడుకోవడానికి వచ్చేవారు. తను ఇష్టపడ్డ లిటిల్ బాయ్ కోసం giant ఎన్నో సంవత్సరాలనుండి ఎదురుచూస్తూ ముసలివాడు అవుతాడు.
ఒకరోజు మూలన వున్న చెట్టు కింద లిటిల్ బాయ్ ని చూసి ఆశ్చర్య పోతాడు. అంతలోనే అతని రెండు చేతులకు, రెండు పాదాలకు మొలలు (nails) దిగ్గోట్టిన గాయలను చూసి లిటిల్ బాయ్ ముందు మోకరిల్లుతాడు.
And the child smiled on the giant, and said to him, ‘ you let me play once in your garden, today ypu shall come with me to my garden, which is Paradise’.
శరీరంపై పూలతో giant చనిపోయి పడివుండడం పిల్లలు గమనిస్తారు.
కింది లింక్ క్లిక్ చేసి ఇంగ్లీష్ లో కథను చదవండి.
https://www.eastoftheweb.com/short-stories/UBooks/SelGia.shtml
3. "ది నైటింగేల్ అండ్ ది రోజ్”
నైటింగలే స్నేహం కోసం చేసిన త్యాగం ఈ కథ. తన స్నేహితుడి ప్రేమ కోసం, గులాబీని ఎర్ర గులాబీగా మార్చడానికి తన రక్తాన్ని ధారపోసి,చివరకు ప్రాణాలు కోల్పోయే నైటింగేల్ హృదయవిదారక విషాద కథ ఇది.
ఒక యువ విద్యార్థి తన ప్రియురాలితో డాన్స్ చేయాలని కోరుకుంటాడు. ప్రియురాలు తనతో డాన్స్ చేయలంటే ఎర్ర గులాబీ తేవాలని షరతు పెడుతుంది. తోటలో ఎక్కడా ఎర్ర గులాబీలు వుండవు ఎలా అని మదనపడుతూ, తన ముఖాన్ని రెండు చేతులలో దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న విద్యార్థిని Oak-tree పైనున్న నైటింగేల్ గమనించి ఈ నిజమైన ప్రేమికుడికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. ‘Here indeed is the true lover,’ said the Nightingale.
అట్లా ఎర్ర గులాబీ కోసం అన్ని తోటలు తిరిగి అది విద్యార్ధి కిటికీ కిందే పెరుగుతున్నదని తెలుసుకొని తిరిగివచ్చి ఆ గులాబీ మొక్కను దీనంగా వేడుకొంటుంది ‘Give me a red rose,’ she cried, ‘and I will sing you my sweetest song.’
నేను ఎర్ర గులాబీ మొక్కనే కానీ తీవ్రమైన శీతకాలం నా నరాలని(veins), మొగ్గలని మంచు తుంచివేసినది,తుఫాను నా కొమ్మలను విరగొట్టింది. కాని నీకు ఎర్ర గులాబీ కావాలంటే ఒకే ఒక్క భయంకరమైన మార్గం వుందని ఆ రోజ్ మొక్క నైటింగేల్ తో ఇలా అంటున్నది , "నువ్వు వెన్నెలలో సంగీతం ద్వారా దానిని సృష్టించుకోవాలి, అలాగే నీ గుండె రక్తంతో దానికి రంగు అద్దాలి. ఒక ముల్లుకు నీ గుండెను ఆనించి నువ్వు నాకు పాట పాడాలి. రాత్రంతా నువ్వు నాకు పాట పాడాలి; ఆ ముల్లు నీ గుండెను గుచ్చాలి, నీ ప్రాణరక్తం నా నరాల్లోకి ప్రవహించి నాదిగా మారాలి.”
‘If you want a red rose,’ said the Tree, ‘you must build it out of music by moonlight, and stain it with your own heart's-blood. You must sing to me with your breast against a thorn. All night long you must sing to me, and the thorn must pierce your heart, and your life-blood must flow into my veins, and become mine.’ ‘Be happy,’ cried the Nightingale, ‘be happy; you shall have your red rose. I will build it out of music by moonlight, and stain it with my own heart's-blood. All that I ask of you in return is that you will be a true lover.
రాత్రంతా పాడుతూ, ముళ్ళును తన గుండెల్లోకి దించుకుని, తన రక్తంతో ఒక ఎర్ర గులాబీని సృష్టించి ప్రాణాలు కోల్పోతుంది.
.'Look, look!' cried the Tree, 'the rose is finished now;' but the Nightingale made no answer, for she was lying dead in the long grass, with the thorn in her heart.
మరో వ్యక్తి ఆమెకు విలువైన ఆభరణాలు బహుమతిగా ఇవ్వడంతో ఎర్ర గులాబీని తీసుకువెళ్ళిన విద్యార్థినిని అతని ప్రియురాలు తిరస్కరిస్తుంది,దీంతో ఆ విద్యార్థి గులాబీని కోపంతో రోడ్డుపై పారేసి,’In fact, it is quite unpractical’ ప్రేమ అనేది పనికిరానిదని, ఆచరణీయం కానిదని భావించి, మళ్ళీ philosophy వైపు దృష్టి పెట్టి metaphysics చదువుకుంటాను అనుకుంటూ తిరిగివెళ్తాడు.‘What a silly thing Love is,’ said the Student as he walked away’
విద్యార్థి మరియు ప్రియురాలు ఇద్దరు superficial ప్రేమకు, ఆకర్షణకు సింబల్ అయితే నైటింగిల్ స్వచమైన ప్రేమకు సింబల్. రెండు అంశాలు: స్వచ్చమైన ప్రేమ, స్వార్థపూరిత ప్రేమ కథ లో ప్రధానం.
యువతి డబ్బుకు,భౌతిక వస్తువులకు ప్రాధాన్యత నివ్వడం,యువకుడు ప్రేమ లోతును అర్థం చేసుకోకపోవడం, నైటింగేల్ త్యాగం వృధా కావడం, బావోద్వేగాలను, నిజమైన ప్రేమను నిర్లక్ష్యం చేసే సమాజంను ఈ కథ చిత్రిస్తుంది.
కింది లింక్ క్లిక్ చేసి ఇంగ్లీష్ లో కథను చదవండి.
https://www.eastoftheweb.com/short-stories/UBooks/NigRos.ష్టమల్

Comments
Post a Comment